*టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కవ్వంపల్లి సత్యనారాయణకు శుభాకాంక్షలుతెల్పిన తెలంగాణ రాష్ట్ర NSUI నాయకుడు గొల్ల జాన్*
*కుత్బుల్లాపూర్ మార్చ్ 13, ( ప్రజా గొంతుక )*
మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా పదవి స్వీకారం చేసారు.
ఈ సందర్భంగా గొల్ల జాన్ మాట్లాడుతూ... చదువులో రాజకీయాల్లో రాణించి అకుంఠిత దీక్షతో ఈ స్థాయికి వచ్చారని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతికి విద్యే ప్రధాన మార్గమని అందరూ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేశంలో నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే సామాజిక న్యాయాన్ని పాటిస్తూ, దేశ ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తోంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టీపీసీసీ అధ్యక్షుల బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర మంత్రులు, దళిత ఎమ్మెల్యే లు, మాజీ ఎస్సి విభాగం అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం అన్న , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.












