E-PAPER

*ముప్పారం గ్రామ డైరీ తో కలెక్టర్ ను కలిసిన సర్పంచ్*

Date : 12 March 2026, 8:59 pm Posted By : PRAJA GONTHUKA

*ముప్పారం గ్రామ డైరీ తో కలెక్టర్ ను కలిసిన సర్పంచ్*

*ముప్పారం గ్రామ డైరీ తో కలెక్టర్ ను కలిసిన సర్పంచ్*

ప్రజా గొంతుక (తెలుగు దినపత్రిక) స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ సమగ్ర సమాచారంతో రూపొందించిన ‘ముప్పారం సమాచార దర్శిని’ పుస్తకాన్ని గురువారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌కు గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక అందజేశారు. సర్పంచుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సదస్సుకు హాజరైన రేణుకను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు.

గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, విలేజ్ క్యాబినెట్ పనితీరు గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచిగా బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు పూర్తికాకముందే గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రేణుక తెలిపారు. అలాగే ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రోత్సాహం గురించి కూడా జిల్లా అధికారులకు వివరించారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రవి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ సహా పలువురు ఉన్నతాధికారులకు కూడా ముప్పారం డైరీను సర్పంచ్ రేణుక అందజేశారు...

⬇ DOWNLOAD
×

*ముప్పారం గ్రామ డైరీ తో కలెక్టర్ ను కలిసిన సర్పంచ్*

ప్రజా గొంతుక (తెలుగు దినపత్రిక) స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ సమగ్ర సమాచారంతో రూపొందించిన ‘ముప్పారం సమాచార దర్శిని’ పుస్తకాన్ని గురువారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌కు గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక అందజేశారు. సర్పంచుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సదస్సుకు హాజరైన రేణుకను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు.

గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, విలేజ్ క్యాబినెట్ పనితీరు గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచిగా బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు పూర్తికాకముందే గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రేణుక తెలిపారు. అలాగే ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రోత్సాహం గురించి కూడా జిల్లా అధికారులకు వివరించారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రవి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ సహా పలువురు ఉన్నతాధికారులకు కూడా ముప్పారం డైరీను సర్పంచ్ రేణుక అందజేశారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్