ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మట్టల పంపిణీ
నిరుపేద కుటుంబానికి అండగా మాజీ కౌన్సిలర్ అరవింద్ రెడ్డి:
ప్రజా గొంతుక బచ్చన్నపేట:బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తూ జనగామ మాజీ కౌన్సిలర్ అరవింద్ రెడ్డి తన మనసున్నతను చాటుకున్నారు. గ్రామానికి చెందిన జె. రాజు,సంతోష గ్రామపంచాయతీ సిబ్బందిగా పనిచేస్తూ సాధారణ జీవనం గడుపుతున్నారు. తన కుమార్తె వివాహానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న అరవింద్ రెడ్డి వెంటనే స్పందించి వివాహానికి అవసరమైన పుస్తె మట్టలు అందజేసి సహాయం చేశారు.ఈ సందర్భంగా అరవింద్ రెడ్డి మాట్లాడుతూ, పేద కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా కలిగే ఆనందం అమూల్యమని తెలిపారు. గత పది సంవత్సరాలుగా తనకు చేతనైనంతగాఅవసరమైన వారికి సహాయం చేస్తూ వస్తున్నానని చెప్పారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి గుర్రం బాలరాజు, హరికృష్ణ,అజయ్ రెడ్డి, సురేష్,తదితరులు పాల్గొన్నారు.












