ఎంఈఓ పాపమ్మకు ఘనంగా సన్మానం.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 12 మార్చి 2026.వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లో నూతనంగా ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన పాపమ్మను సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో , ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోనీ విద్యార్థులకు మరింతగా సేవలు అందించాలని అన్నారు. విద్య అభివృద్ధిలో తన వంతు కర్తవ్యం నిర్వర్తించి మరింతగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అండెం కరుణాకర్ రెడ్డి , మేడి రమేష్ గౌడ్, బొనగాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.












