ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు
కుత్బుల్లాపూర్ మార్చ్ 12,(ప్రజా గొంతుక )
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డాక్టర్ ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల 13 మార్చి 2026, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించబడనున్న గ్రాండ్ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ప్రముఖ నాయకులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంలు గౌడ్ , నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి , జీడిమెట్ల సి.ఐ మల్లేష్ లను స్వయంగా కలిసి కార్యక్రమానికి హాజరు కావలసిందిగా డాక్టర్ ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్బంగా ముద్దాపురం మాట్లాడుతూ...రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని సౌహార్దం, సోదరభావం సామాజిక ఐక్యతను బలపరచడం లక్ష్యంగా ఈ గ్రాండ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి ప్రాంతీయ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మరియు స్థానిక ప్రజలు భారీగా హాజరుకానున్నారు.ఈ సందర్భంగా నాయకులు కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇఫ్తార్ విందుకు తప్పక హాజరవుతామని తెలిపారన్నారు.












