E-PAPER

భద్రాచల రామునికి గోటి తలంబ్రాలు అందించిన గజ్వల్ సిఐ రవికుమార్

Date : 11 March 2026, 8:46 pm Posted By : PRAJA GONTHUKA

భద్రాచల రామునికి గోటి తలంబ్రాలు అందించిన గజ్వల్ సిఐ రవికుమార్

భద్రాచల రామునికి గోటి తలంబ్రాలు అందించిన గజ్వల్ సిఐ రవికుమార్

*● రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం*

*గజ్వేల్ మార్చ్ 11 ( ప్రజా గొంతుక )*

భద్రాచల రామయ్య కల్యానానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని రామయ్య కల్యానానికి వడ్లు ఓలిచి అందిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం నాడు గజ్వేల్ సిఐ రవికుమార్ గారు కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమంలో పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటి వడ్లు ఓలిచి రామయ్య కళ్యానానికి అందించాలని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజుకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నాడు శ్రీరామునికి సేవలు హనుమంతుల వారు ఎలా చేశారో నేడు అదే మన రామకోటి రామరాజు ఆణువణువున రామభక్తిని నింపుకొని రామయ్య సేవలు చేయడం అభినందనీయం అన్నారు. అందరితో గోటి తలంబ్రాలు ఓలిపించి భద్రాచల రామయ్య కల్యానానికి అందించడం మన అదృష్టం అన్నారు. మమ్మల్ని కూడా అందులో బాగా స్వాములను చేయడం సంతోషదాయం అన్నారు. తొలిసారిగా గోటితో వడ్లు ఓలిచే భాగ్యం కలిగిందన్నారు. హిందూ సనాతన ధర్మ రక్షణకు అందరు కృషి చేయాలన్నారు. అనంతరం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి గోటి తలంబ్రాల ప్యాకెట్లు అందజేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :