దశ దిన కర్మకు హాజరయి ప్రగాడ సానుభూతి తెలియజేసిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:11
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని,అనుముల మండల హాలియా కేంద్రంలో ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించిన ఆవుల ఆంజనేయులు యొక్క దశదినకర్మకు గ్రామ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు, సోషల్ మీడియా సభ్యులు,ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పట్టణ నాయకులతో కలిసి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, శోకసముద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,పెద్ద దిక్కు లేని వారి ఇంటికి నేనున్నానని అక్కున చేర్చుకుని ఆర్థిక సహాయం అందజేసిన స్థానిక శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు












