E-PAPER

గాంధీ నగర్ లో జరగబోయే రంజాన్ ఇఫ్తార్ విందుకు ఆహ్వాణం

Date : 11 March 2026, 5:52 pm Posted By : PRAJA GONTHUKA

గాంధీ నగర్ లో జరగబోయే రంజాన్ ఇఫ్తార్ విందుకు ఆహ్వాణం

గాంధీ నగర్ లో జరగబోయే రంజాన్ ఇఫ్తార్ విందుకు ఆహ్వాణం

*-డాక్టర్ ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్*

*కుత్బుల్లాపూర్ మార్చ్ 11, ( ప్రజా గొంతుక )*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డా. ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని భారీ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమం 13-03-2026 శుక్రవారం సాయంత్రం 6:00 గంటలకు గాంధీనగర్‌లోని రాయల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో జరగనుంది.

ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంత్ రావు ను డా. ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమానికి అందజేసిన తొలి ఆహ్వాన పత్రంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డా. ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.....

రంజాన్ మాసం ప్రేమ, సౌభ్రాతృత్వం, ఐక్యతకు ప్రతీక అని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇంత పెద్ద స్థాయిలో ఇఫ్తార్ విందు నిర్వహించడం ఇదే మొదటిసారి అని, వివిధ మతాలకు చెందిన ప్రజలు, ముస్లిం సోదరులు, సామాజిక, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ, సామాజిక నాయకులు పాల్గొని రంజాన్ సందేశాన్ని ప్రజలకు తెలియజేసేలా ప్రత్యేక ప్రసంగాలు చేయనున్నారని చెప్పారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని డా. ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు.

⬇ DOWNLOAD
×

గాంధీ నగర్ లో జరగబోయే రంజాన్ ఇఫ్తార్ విందుకు ఆహ్వాణం

*-డాక్టర్ ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్*

*కుత్బుల్లాపూర్ మార్చ్ 11, ( ప్రజా గొంతుక )*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డా. ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని భారీ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమం 13-03-2026 శుక్రవారం సాయంత్రం 6:00 గంటలకు గాంధీనగర్‌లోని రాయల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో జరగనుంది.

ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంత్ రావు ను డా. ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమానికి అందజేసిన తొలి ఆహ్వాన పత్రంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డా. ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ…..

రంజాన్ మాసం ప్రేమ, సౌభ్రాతృత్వం, ఐక్యతకు ప్రతీక అని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇంత పెద్ద స్థాయిలో ఇఫ్తార్ విందు నిర్వహించడం ఇదే మొదటిసారి అని, వివిధ మతాలకు చెందిన ప్రజలు, ముస్లిం సోదరులు, సామాజిక, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ, సామాజిక నాయకులు పాల్గొని రంజాన్ సందేశాన్ని ప్రజలకు తెలియజేసేలా ప్రత్యేక ప్రసంగాలు చేయనున్నారని చెప్పారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని డా. ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్