E-PAPER

అంబేద్కర్ నగర్ లో రంజాన్ “ఈద్ కా తోఫా” పంపిణీ

Date : 11 March 2026, 4:37 pm Posted By : PRAJA GONTHUKA

అంబేద్కర్ నగర్ లో రంజాన్ “ఈద్ కా తోఫా” పంపిణీ

అంబేద్కర్ నగర్ లో రంజాన్ "ఈద్ కా తోఫా" పంపిణీ

కుత్బుల్లాపూర్ మార్చ్ 11 ( ప్రజా గొంతుక )

రంజాన్ పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు తోడ్పాటు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న “ఈద్ కా తోఫా” (రంజాన్ కానుక) పథకం పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అంబెడ్కర్ నగర్‌లోని జామా మసీద్-ఎ-మొహమ్మదియా వద్ద కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి హాజరై మసీదుల ద్వారా అర్హులైన ముస్లిం కుటుంబాలకు ఈద్ కా తోఫాలు,,దుస్తులు, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ...రంజాన్ పండుగ సోదరభావం, సహనం, సేవా భావానికి ప్రతీక అని అన్నారు.పేద ప్రజలకు అవసరమైన కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈద్ కా తోఫా పథకం వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కెఎమ్ గౌరీష్, డివిజన్ అధ్యక్షులు ఎండి జాకీర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి, మన్నే రాజు, బేకు శ్రీనివాస్, బుయ్యని శివ కుమార్, కయ్యుమ్, జెస్సి పాల్, ప్రదీప్, కుమార్, ప్రవీణ్, సురేందర్, రమేష్, అక్బర్, సిద్దనోల సంజీవరెడ్డి, మైసిగారి శ్రీనివాస్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుజాత, సుజాత యాదవ్, అరుణ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

అంబేద్కర్ నగర్ లో రంజాన్ “ఈద్ కా తోఫా” పంపిణీ

కుత్బుల్లాపూర్ మార్చ్ 11 ( ప్రజా గొంతుక )

రంజాన్ పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు తోడ్పాటు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న “ఈద్ కా తోఫా” (రంజాన్ కానుక) పథకం పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అంబెడ్కర్ నగర్‌లోని జామా మసీద్-ఎ-మొహమ్మదియా వద్ద కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి హాజరై మసీదుల ద్వారా అర్హులైన ముస్లిం కుటుంబాలకు ఈద్ కా తోఫాలు,,దుస్తులు, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…రంజాన్ పండుగ సోదరభావం, సహనం, సేవా భావానికి ప్రతీక అని అన్నారు.పేద ప్రజలకు అవసరమైన కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈద్ కా తోఫా పథకం వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కెఎమ్ గౌరీష్, డివిజన్ అధ్యక్షులు ఎండి జాకీర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి, మన్నే రాజు, బేకు శ్రీనివాస్, బుయ్యని శివ కుమార్, కయ్యుమ్, జెస్సి పాల్, ప్రదీప్, కుమార్, ప్రవీణ్, సురేందర్, రమేష్, అక్బర్, సిద్దనోల సంజీవరెడ్డి, మైసిగారి శ్రీనివాస్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుజాత, సుజాత యాదవ్, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్