అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
కుత్బుల్లాపూర్ మార్చ్ 11, ( ప్రజా గొంతుక )అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గణేష్ నగర్ పరిధిలోని పద్మనగర్ ఫేస్ -1, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అకోడే శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి హాజరయ్యారు.వారి సమక్షంలో కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హన్మంత్ రెడ్డి చేతులమిడదిగా GHMC కార్మికులకు చీరలు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మహిళ అధ్యక్షురాలు రాజనోల్ల లక్ష్మి, డీసీసీ ఉపాధ్యక్షులు దమ్మని శ్రవణ్ కుమార్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ కెఎమ్ గౌరీష్, డివిజన్ అధ్యక్షులు ఎండి .జాకీర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి, మన్నే రాజు, బేకు శ్రీనివాస్, బుయ్యని శివ కుమార్, కయ్యుమ్, జెస్సి పాల్, ప్రదీప్, కుమార్, ప్రవీణ్, సురేందర్, రమేష్, అక్బర్, సిద్దనోల సంజీవరెడ్డి, మైసిగారి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు సుజాత, సుజాత యాదవ్, అరుణ తదితరులు పాల్గొన్నారు.












