కొంపల్లి లో "పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్" శాఖను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద
కుత్బుల్లాపూర్ మార్చ్ 11, ( ప్రజా గొంతుక )
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి కొంపల్లి మున్సిపాలిటీ పరిధి కొంపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన "పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ " కొంపల్లి బ్రాంచ్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ వినోద్ కందేల్వాల్, బ్రాంచ్ మేనేజర్ విగ్నేశ్వర్.సీ, మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, మాజీ కౌన్సిలర్లు చింతల దేవేందర్ యాదవ్, చింతల రవీందర్ యాదవ్, డప్పు కిరణ్, వినోద్, కో- ఆప్షన్ సభ్యులు వెంకటేష్, పాక్స్ డైరెక్టర్ మధుసూదన్, నాయకులు యాదగిరి, మహేష్, రఘు, చందు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












