E-PAPER

పొగుళ్లపల్లి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఇఓ రాజేశ్వర్.

Date : 10 March 2026, 4:35 pm Posted By : PRAJA GONTHUKA

పొగుళ్లపల్లి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఇఓ రాజేశ్వర్.

పొగుళ్లపల్లి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఇఓ రాజేశ్వర్.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 10 మార్చి 2026.

మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రాజేశ్వర్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి గ్రామంలో గల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రీ ఫైనల్ జవాబు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలను ఎటువంటి భయాందోళనకు గురికాకుండా వ్రాయాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేస్తూ మారుమూల ప్రాంత విద్యార్థులకు సేవ చేస్తే వారు ఎల్లప్పుడూ మనల్ని గుర్తు చేసుకుంటారని తెలియజేశారు. అనంతరం మధ్యాహ్న భోజన వంటగదిని పరిశీలించారు . అలాగే డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ శ్రీ అప్పారావు మాట్లాడుతూ పాఠశాలలో సైన్స్ మేళాలు విద్యార్థులలో సైన్స్ పై ఆసక్తి పెంపొందించేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ విష్ణువర్ధన్ రావు , డీఈవో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుమన్, సుధాకర్, రాజ్ కుమార్, పాషా మియా, నరసయ్య, సాంబయ్య, వసంత, జిమ్యాలాల్, సూరయ్య, శ్రీలత, మాధవి, మదన్మోహన్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్