నేడే కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ జిన్నారం పెద్దగౌని ప్రసాద్ గౌడ్ వర్ధంతి.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్,మార్చ్ 9:
మెదక్ జిల్లా.శివంపేట మండల కేంద్రం,గూడూరు ఉమ్మడి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ జిన్నారం పెద్దగౌని ప్రసాద్ 22వ వర్ధంతి మంగళవారం పురస్కరించుకొని ఉదయం 9 గంటలకు గూడూరు గ్రామంలోని ప్రసాద్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం గూడూరులోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బేతాని వికలాంగుల హాస్టల్ లో విద్యార్థులకు కూడా ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జిన్నారం పెద్దగోని శ్రీనివాస్ గౌడ్,రమణ గౌడ్, రాజ్యం బిక్షపతి,కొడకంచి సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. గూడూరు లోని ప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుందని ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి ప్రసాద్ అభిమానులు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.












