వడ్డెర కులాన్ని బి సి నుండి ఎస్సీ ఎస్టీ లో చేర్చాలని ఎమ్మెల్యే కి వినతి పత్రం
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:09
వడ్డెర కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి
అణగారిన వడ్డెర తెగ 47 ఏళ్ళుగా (ఎస్టీ.) డిమాండ్ కోసం పోరాడుతున్నాము.
భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలువబడే వడ్డెర్లము కష్టపడి పనిచేసే నవ్వు
గిరిజనులము మా చెమట మరియు రక్తంతో భారతదేశంలో ఆధునిక కట్టడాలను నిర్మించాము.
బ్రిటిష్ కాలంలో మా కులాన్ని క్రిమినల్ ట్రైబ్స్ (సి టి) గా ముద్రవేయడం మా తెగకు సామాజిక కళంకం మరియు
దోపిడి (1952 లో వడ్డెరలను (డిఎన్టి )
గా మార్చినప్పటికి మా వడ్డెర కులానికి ఎలాంటి సహాయ
సహకారం అందకపోవడం వలన అన్ని రంగాలలో వెనుకబడిపోయాము1976లో (ఎస్సీ /ఎస్టీ). చట్టం భారతదేశంలోని అనేక రాష్ట్రాలో ఉన్న వడ్డెర కులాన్ని గురించి (ఎస్సీ/ఎస్టీ.) గా
చేర్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని (డిఎన్టి) లో ఉన్న ఇతర కులాలను (ఎస్సీ/ఎస్టీ.) గా గుర్తించింది. కానీ
అదే చట్టం ఇదే (డిఎన్టి) లో ఉన్న వడ్డెర కులాన్ని (ఎస్టీ.) గా చేర్చడంలో విఫలమై తెలంగాణలో
ఉన్న వడ్డెరలు (బి సి) లుగా మిగిలిపోయారు.
(బి సి) లుగా ఉండడం కారణంగా విద్య ఉపాధి ఆర్ధిక రాజకీయ రంగాలలో వడ్డెర్లు వెనుకబడిపోయారు.
వడ్డెర కుల అభ్యన్నత కోసం వడ్డెర కులాన్ని (బి సి) జాబిత నుండి తొలగించి (ఎస్టీ.) జాబితాలో చేర్చాలని
47 సం॥లుగా పోరాడుతూనే ఉన్నాము.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి స్వర్గీయ వై. యస్. రాజశేఖర్ రెడ్డిగారు
వడ్డెర కులాన్ని (ఎస్టీ.)లో చేరుస్తామని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వడ్డెర సంఘం బహిరంగ సభలో ప్రకటించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మహబూబ్నగర్
ఎం.పి.గా. ఉన్న సమయంలో వడ్డెర కులాన్ని (ఎస్టీ) లో చేర్చాలని కేంద్రానికి లేఖ రాశారు.
తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వడ్డెర కులాన్ని (ఎస్టీ.)లో చేర్చాలని
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కి బహిరంగ లేఖ రాశారు. తదనంతరం 2018లో మెదక్
జిల్లా ముత్తంగి వడ్డెర సంఘం బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వడ్డెర కులాన్ని (ఎస్టీ) లో
చేర్చి అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తానని వడ్డెర కులానికి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల
బడ్జెట్ కేటాయిస్తానని బహిరంగ సభలో ప్రకటించారు.
జూడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అనేక బహిరంగ సభలో వడ్డెర కులాన్ని (ఎస్టీ.) జాబితాలో
చేరుస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టో 31 పేజీ 5వ లైన్లో వడ్డెర కార్పొరేషన్
ఏర్పాటు చేసి సరిపడా నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.
స్వరాష్ట్రం ఏర్పడ్డాక అధికారిలోకి వచ్చిన బి.ఆర్.ఎస్. పార్టీ ప్రభుత్వం వడ్డెర్లను ఏనాడు పట్టించుకోలేదని రాష్ట్రంలో
ఉన్న వడ్డెర్లు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు. కానీ మా వడ్డెర్ల ఓట్లను వేయించుకొని
ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వడ్డెర్లకు ఇచ్చిన హామీలు మర్చిపోయారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడుస్తున్న ఎక్కడ వడ్డెర్ల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. వడ్డెర్లకు
ఇచ్చిన హామీలు నెరవేర్లకుండా వడ్డెరలని విస్మరించి వడ్డెర్ల మనోభావాలను దెబ్బతీశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ
రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో వడ్డెర్ల గురించి ప్రస్తావించి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు మరియు వడ్డెర్ల
(ఎస్టీ.)
జాబితాలో చేర్చుటకు అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపాలి. పంపని యెడల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న
వడ్డెర్లందర్నీ కూడగట్టుకొని అసెంబ్లీ ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తమరితో విన్నవించుకుంటునామని అన్నారు












