మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కను నాటిన గ్రామ సర్పంచ్
ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద మైరడ లీడర్, కాటన్ కనెక్ట్, పై మార్క్ డిపిసి కళ్యాణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
తనంతరం తోపనపల్లి గ్రామ సర్పంచ్ చాగంటి మమత తిరుమల్ చేతుల మీదుగ గుండ్రపల్లి గ్రామ వాస్తవ్యులు వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రావి వేప మొక్కలు వారి చేతుల మీదుగా నటించారు
ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ కాలుష్యం నివారించడానికి పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు
పంట సాగు భూమి వద్ద ఇంటి పెరట్లో మొక్కలు నాటి చెట్లను పెంచాలని మహిళా రైతు సోదరి సోదరీమణులను కోరారు
ప్రపంచ మహిళా
దినోత్సవం రోజున
మహిళ సర్పంచిగా గ్రామ ప్రజలు అవకాశాన్ని ఇచ్చినందుకు
గ్రామ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు
ఈ పవిత్రమైన రోజున గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కను నాటడం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో పంట భూములలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కాలుష్య నివారించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు
గుండ్రపల్లి గ్రామ నివాసి మన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య తను చేస్తున్న గొప్ప కార్యాన్ని ప్రతి ఒక్కరు తనని ఆశీర్వదించి తను చేస్తున్న మొక్కలు నాటడం పెంచడం సౌరక్షణ చేయడం ఎంతో ఓపికతో ఎంతో కృషితో చేస్తున్న సమ్మయ్యకు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంపూర్ణ , జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మాంకాల యాదగిరి ,ఆగ్రోనోమిస్ట్ అనిల్ కుమార్, అగ్రనమిస్ట్ గౌతమి, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ బీసీ రమేష్, ఆశ వర్కర్లు రైతు సోదరి సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు












