చాకరిమెట్ల లో జిల్లా అదనపు ఎస్పీ ప్రత్యేక పూజలు.
శివంపేట ప్రజా గొంతుక న్యూస్,మార్చ్ 8 :
మెదక్ జిల్లా.శివంపేట మండలం,చిన్న గొట్టుముక్కల గ్రామ సమీపంలోని గల దట్టమైన అడవి ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఆదివారం స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి, ఆలయ అర్చక సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.












