ఘనంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు
ప్రజా గొంతుక న్యూస్,(మార్చి 08)సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ 11వ వార్డు రాయినిగూడెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలలో భాగంగా ఆదివారం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవమును శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, కౌన్సిలర్ ఏలుగూరి ఇందిర వీరయ్య గౌడ్, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, ఓఎస్డీ ప్రేమ కరణ్ రెడ్డి, సిఐ గుర్రం వినాయక రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.కొణతం రవీందర్ రెడ్డి స్వప్న ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వేడుకల్లో వార్డు ప్రజలు,భక్తులు, నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












