సూర్యాపేట లో సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్
*వివాహ మహోత్సవ షాపింగ్ మాల్ లో ప్రారంభోత్సవం లో నిధి అగర్వాల్*
ప్రజా గొంతుక న్యూస్,(మార్చి 08)సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్ లోనీ మహాత్మా గాంధీ విగ్రహం ఎదురుగా నూతనంగా ఏర్పాటుచేసిన వివాహ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్ ఆదివారం ప్రారంభించి సందడి చేశారు. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ అభిమానిని,ఆయనతో హరిహర వీరమల్లు సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు. వచ్చే నెలలో పెద్ద సినిమా ప్రాజెక్ట్ లు ఉన్నాయని.. త్వరలో అప్డేట్స్ మీడియాకు వెల్లడించనున్నట్టు తెలిపారు. శుభకార్యాలకు అవసరమయ్యే వస్త్రాలకు సుదూర ప్రాంతాలలైన హైదరాబాద్, విజయవాడ నగరాలకు వెళ్లకుండా సూర్యాపేట పట్టణంలో మహిళలకు వివాహ మహోత్సవ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. రాష్ట్ర రాజధానికి ధీటుగా షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేసి అన్ని రకాల చీరల తో, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే అందిస్తున్న శింగిరికొండ రవీందర్ ను, ఆయన కుమారుడు వంశినీ ఆమె అభినందించారు.సినీ నటి నిధి అగర్వాల్ సూర్యాపేట కు పెద్ద ఎత్తున ఆమెను చూడడానికి తరలివచ్చారు.












