E-PAPER

గోల్డెన్ నంది అవార్డు గ్రహీత యోగ గురువు చాడ పాపిరెడ్డి కి సన్మానం

Date : 09 March 2026, 1:09 pm Posted By : PRAJA GONTHUKA

గోల్డెన్ నంది అవార్డు గ్రహీత యోగ గురువు చాడ పాపిరెడ్డి కి సన్మానం

*గోల్డెన్ నంది అవార్డు గ్రహీత యోగ గురువు చాడ పాపిరెడ్డి కి సన్మానం

ప్రజా గొంతుక న్యూస్, (మార్చి 08)సూర్యాపేట:ఈనెల 1 న మెఘ హెల్పింగ్ ఫౌండేషన్,మేఘ ఈవెంట్స్ హైదరాబాద్ వారు

ఉగాది సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డుల కార్యక్రమం ఏర్పడడం జరిగినది.అందులో భాగంగా యోగా ద్వారా ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు, యోగా గురువు చాడ పాపి రెడ్డి కి గోల్డెన్ నంది అవార్డు ప్రకటించి సత్కరించడం జరిగినది. ఈ అవార్డును పురస్కరించుకొని ఆదివారం సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా సాధకులు యోగా గురువు చాడ పాపిరెడ్డి ని ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా యోగా గురువు చాడ పాపిరెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు నాకు రావడం ఎంతో బాధ్యత ను పెంచిందని,ఇంకా మునుముందు ఎంతో మంది యోగా నేర్చుకునే విధంగా కృషి చేస్తానని తెలిపారు. గత 18 సంవత్సరాలుగా సూర్యాపేట పట్టణంలో యోగా ద్వారా వందలాది మందికి ఆరోగ్యంగా ఉండడానికి నిత్య సాధనలో ఎంతోమందికి ఉపయోగపడు చున్నాము అని, ముఖ్యంగా వెన్నునొప్పి, థైరాయిడ్,పి సి ఓ డి,సరిగా నిద్రలేక పోవడం, గ్యాస్ ట్రబుల్, షుగరు, బిపి, మానసిక ఒత్తిడి తో పాటు తలనొప్పి, మైగ్రేన్, సయాటిక్, ఇలా ఎన్నో రకాల వ్యాధులకు ఇబ్బంది పడుచున్న వారు యోగ క్లాస్ కు వచ్చి యోగ చేసుకుని ఎంతోమంది ఆరోగ్యంగా ఉంటున్నారని తెలిపారు.

మన యోగ సెంటర్ నందు యోగా శిక్షణ పొందిన సాధకులు ఆయుష్ డిపార్ట్మెంట్ ,గురుకుల పాఠశాలలో యోగ ఉపాధ్యాయుల పనిచేయుచున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంత్ నిరంకార్ సంస్థ జిల్లా నిర్వాహకురాలు కడారి సరళ , రిటైర్డ్ ఆర్ ఐ శ్రీపాద భాస్కర చారి, బ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి కట్టెకోల పూర్ణచంద్రరావు , గోరెంట్ల శ్రీనివాస్, సుధాకర్, సుదర్శన్ రెడ్డి, శ్రీదేవి, రవీంద్ర చారి,వీరశేఖర్, బాలకృష్ణ, బాణాల శ్రీనివాస్, మమత, మంజుల,పద్మ,రజిత, సరిత సుజాత ధనలక్ష్మి, లక్ష్మి దివ్య, సామ్రాజ్యం, రవికుమార్, మురళీకృష్ణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్