మహిళలు అన్ని రంగాలలో రాణించాలి
ప్రజా గొంతుక న్యూస్, (మార్చి 08)సూర్యాపేట:మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం సాయంత్రం సాయిబాబా ఫంక్షన్ హాల్ లో వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవం వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు మహిళలు వ్యాపారం, ఉద్యోగము అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఆకాశమే హద్దుగా మహిళలు నేడు ప్రతి రంగంలో కూడా దూసుకుపోతున్నారని ఆమె చెప్పారు. మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలో వివిధ రంగాలలో సేవలందిస్తున్న మహిళలకు మహిళల దినోత్సవం సందర్భంగా ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐపీఇ సభ్యులు తోట శ్యాం ప్రసాద్, ఐపీసీ బిక్కుమల్ల కృష్ణ, కలకోట లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, శివసాయి సోలార్ మార్కెటింగ్ బుద్ధ శ్రీనివాస గుప్తా, తోట కమల, కలకోట అనిత, మిట్టపల్లి శ్రీదేవి, వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ లకుమారపు పద్మజ, ట్రెజరర్ బెలిదె లక్ష్మి, సెక్రటరీ కక్కిరేణి అనిత తదితరులు పాల్గొన్నారు.













