అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
- తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో.
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామం లో స్కూల్ దగ్గర వ్యవసాయ మహిళ కూలీలు అందరూ కలసి తెలంగా ణ వ్యవసాయ వృత్తిదారుల యూ నియన్ ఆధ్వర్యంలో అంతర్జా తీయ మహిళా దినోత్సవం కార్య క్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి లావణ్య ఈ విధంగా మాట్లాడారుమార్చి 8 ఈ దినో త్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల పనులు అంతరించిపోవడం జరుగుతుంది ఎందుకంటే యంత్రాలతో పని చేయించడంతో వ్యవసాయ పనులపై ఆధారపడి కుటుంబా లను పోషించుకునే కూలీలకు పని దొరకడం లేదు అందువలన మళ్లీ వలస వ్యవస్థ ఏర్పడింది వలస దూర ప్రాంతాలకు వెళ్లడం వలన వలస తీసుకుపోయేవారు మహిళ ల పైన లైంగిక దాడులు గురిచే స్తారు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని అత్యాచారాలు చేస్తూ మరియు తక్కువ వేతనా లకు ఎక్కువ పని గంటలు పనిచే యడం శ్రమదోపిడి గురి కావడం చేసిన పని డబ్బులు కూడా వారం వారం ఇవ్వకుండా అవసరానికి సంబంధించిన అంత డబ్బులు మాత్రమే ఇస్తూ మిగతా డబ్బు లంతా వారి దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది పూర్తి డబ్బులు చెల్లించినచో వారి ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్లిపోతారని దూర దృష్టితో వారి వేతనాలను వారి దగ్గరే ఉంచుకోవడం జరుగు తుంది. అందువలన సొంతంగా పనులు చేసుకోవడానికి స్వగ్రా మంలో పనులు దొరికే విధంగా గ్రామీణ ఉపాధి పథకంలో పని చేయడానికి ఒక వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరములో 200 రోజులు పని కల్పించి వారికి జాబ్ కార్డు వ్యక్తిగత జాబ్ కార్డు ఇవ్వాలి పనిచేసిన 15 రోజుల్లో పై వేత నాలువారికిఇవ్వాలిపూర్వకాలంలో కుటీర పరిశ్రమలు ఉండేటివి రానురాను కుటుంబాల పరిశ్రమ లు అంతరించిపోవడం జరిగింది ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ ఇస్తే ఆకులు రావడం వలన కుటీర పరిశ్రమలు తొలి పోవడం జరిగింది గ్రామీణ ఉపాధి పథకంలో తప్ప సమాన స్త్రీపురుషులకు సమాన వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. ఏ ఇతర రంగంలో మాత్రము స్త్రీ పురుషులకు సమాన వేతనాలు ఇవ్వడం లేదు కనీస వేతనాలు చట్టపకరంగా ఒక రోజుకు ఒక వ్యక్తికి 950 రూపాయలు ఇవ్వాలి. కానీ ఇవి ఎక్కడ అమలు కావడం లేదు. భారత రాజ్యాంగం ప్రకా రంగా రిజర్వేషన్లు రాజకీయంలో కల్పించడం జరిగింది కానీ రిజర్వే షన్ ప్రకారంగా ఎన్నికలలో వి జయం చెందిన మహిళలు మాత్రం అధికారాలు ఉండవు వారి కుటుం బాల సభ్యులైన పురుషులు మాత్ర మే వారి పేరు చెప్పి చలామణి చేస్తూ ఉంటారు మహిళలకు పూర్తి స్వేచ్ఛ లేదు ఫైల్లో పైన సంతకాలకు మాత్రమే వారిని పరిమితం చేయ డం జరుగుతుంది. ఇంకా ఎక్కడ రాజకీయము ఇంకెక్కడ స్త్రీలకు సమానము హక్కు దొరుకుతుంది
చిన్నపిల్లల నుండి పెద్ద వయసు పైబడిన వారి పైన మహిళల పైన దేశంలో ఏదో ఒక చోట ప్రతిరోజు హత్యలు మానభంగాలు దౌర్జన్యా లు ఆటోలో కిడ్నాప్లు మహిళా గొంతులో ఉన్న చైన్ నేచర్ కోసం గొంతులో ఉన్న తాళిబొట్లను తిప్పుకోవడం వలన గొంతు కోసుకునే అక్కడికక్కడే మరణిం చడం జరుగుతుంది స్త్రీలు
స్వాతంత్రం వచ్చి నేటికి 78 సంవత్సరాలు పైబడిన ఎన్నో చట్టాలు వచ్చినా మహిళల పైన దౌర్జన్యాలు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇల్లు వదిలి చదువుకో డానికి పోవాలన్న ఊరికి పోవాల న్నా పొలం నుండి ఇంటికి తిరిగి రావాలన్నా భయము భయము భయము భయము తో వణుకు తూ జీవితము ప్రతి మహిళ నడుము బిగించి మహిళల హక్కులు సౌకర్యాలు గురించి మహిళల రక్షణ గురించి మాట్లా డుతూ ఏ ఒక మహిళకు అన్యాయం జరిగితే అందరూ మహిళలు ఏకతాటిగా ప్రభుత్వం పైన న్యాయపోరాటం చేయాలని పిలుపునివ్వడం జరిగింది
ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనులు చేయడానికి వెళుతుండగా పని ప్రదేశం నందు లైంగిక వేధింపులకు గురి కావడం జరుగుతుంది అంతేకాదు రాత్రి సమయము కాకుండానే పగటిపూట కూడా మహిళలను ఆటోలో కిడ్నాప్ చేసుకో పోవడము అత్యాచారాలు చేయడము మానభంగాలు చేయడము ఆ చంపివేయడం పెట్రోల్ పోసి అగ్గంటించడం మొదలగువుగా జరుగుతున్నాయి ప్రభుత్వం ఎన్నో రకాలైన చట్టాలు తెచ్చిన మహిళల పైన దాడులు ఆగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్వకాలం కుటీర పరిశ్రమలు చేసుకునేదిగా ఉండేది అనగా కుమ్మరి వారు వడ్రంగి వారు విస్తరా ఆకులు తయారీ మొదలగు రకాలు కుటీర పరిశ్రమలు ఉండేవి ప్రస్తుత సమయంలో రెడీమేడ్ సిస్టం ప్లాస్టిక్ వస్తువులు రావడం వలన కుటీర పరిశ్రమలు కోల్పోవడం జరుగుతుంది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ సర్పంచ్ వరలక్ష్మి వెంకటస్వామి గౌడ్ గారు తెలంగాణ వ్యవసాయ ఉట్టిదారుల గ్రామ సంఘం లీడర్ మహేశ్వరి అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు వ్యవసాయ అనుబంధ కూలీలు మొదలగువారు హాజరు కావడం జరిగింది.












