స్వాతంత్ర్య సమరయోధురాలు అనసూయమ్మకు ఘన సన్మానం
ప్రజా గొంతుక న్యూస్, (మార్చి 08)సూర్యాపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని ఆదివారం సూర్యాపేటకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు అనసూయమ్మను వనిత కుసుమాంబ క్లబ్ సూర్యాపేట అధ్యక్షురాలు అక్కినేపల్లి సంతోషి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరికో స్ఫూర్తినిచ్చిన, వందేళ్లు పూర్తి చేసుకున్న అనసూయమ్మను అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.












