సర్వమత నినాదం మానవత్వం దానగుణం..... ఘనపురం నిరంజన్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:09
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల మండలం మధారిగూడేం గ్రామంలో అమీర్అలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అర్హులైన పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ కానుక అందించటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మదారిగూడెం ఉప సర్పంచ్ సర్వర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలని గుర్తించి రంజాన్ కానుక గా బియ్యం నిత్యవసర సరుకులు చీరలు అందించటం అమీర్ అలి ఫౌండేషన్ సేవలు భవిష్యత్ లో ఎక్కువ మందికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను అన్నారు మదారిగూడెం గ్రామ కార్యదర్శి ఘనపురం నిరంజన్ మాట్లాడుతూ అమీర్ అలి ఫౌండేషన్ సేవలు కులమతాలకీ అతీతంగా నిర్వహిస్తూ అత్యవసర పరిస్థితి లో రక్తదానం చేస్తూ సేవ కార్యక్రమం లో ముందుండే అమీర్అలి ఫౌండేషన్ సేవలని వారి ఫౌండేషన్ సభ్యులని అభినందనలు తెలియచేస్తూన్నాను అన్నారు మధారిగూడేం గ్రామ ఉప సర్పంచ్ షేక్ సర్వర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఘనపురం, నిరంజన్ ,జలీల్ , మౌలనా ,జహీర్ గౌస్, పాల్గొన్నారు













