మహిళా దినోత్సవ సందర్బంగా మహిళల మణులను సన్మాంచిన ఉపాధ్యాయుడు సత్య ప్రకాష్ రావు..
ప్రజా గొంతుక (మార్చి 7 ) కాల్వశ్రీరాంపూర్ :మండలంలోని తారుపల్లి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం పాఠశాలలో సర్పంచ్ గాజనవేన స్వరూప, పాఠశాల మహిళా ఉపాధ్యాయినులు నన్నెబోయిన రమాదేవి, జంగపల్లి స్వరూప, అంగన్వాడీ టీచర్లు సుద్దాల శ్రావణి, ఒడ్నాల రాజమణి, ఎఎన్ఎం ఈర్ల జూపాక, సునీత, ఆశ వర్కర్ మేకల రాధ, అంగన్వాడీ ఆయా బొడ్డుపల్లి వాణి, గ్రామ పంచాయతీ పారిశుద్ద కార్మికురాలు ఆముదాల సారమ్మ, మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఎర్రోజుల సరస్వతి, జక్కుల రమాదేవి, నాంపల్లి వనిత, వివో లశెట్టి రవళి, పాఠశాల పారుశుద్ధ కార్మికురాలు జక్కుల రాజేశ్వరిలతో కలిపి 14 మంది మహిళా మణులను అ పాఠశాల ఆంగ్ల భాషోపాధ్యాయుడు కూరపాటి సత్య ప్రకాశ్ రావు వారిని ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయుడు చేస్తున్న ఇలాంటి అద్భుత కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఆగయ్య, ఎల్లయ్య, రాజమౌళి, రమేష్, వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












