ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం
మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
భూక్య రాజేశ్వరి తిరుపతి నాయక్, సర్పంచ్ వంగరామయ్యపల్లి
పారిశుధ్యం పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించిన గ్రామపంచాయతీ సిబ్బంది
(ప్రజా గొంతుక డెస్క్ )
హుస్నాబాద్ మార్చి (06)
హుస్నాబాద్ మండలంలోని వంగరామయ్యపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుధ్యం పై గ్రామ ప్రజలకు గ్రామపంచాయతీ సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం గ్రామ సర్పంచ్ భూక్య రాజేశ్వరి తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ చెత్త చెదారాన్ని సేకరించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అందుకు గ్రామస్తుల సహకారం చాలా అవసరం అని అన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని కోరారు. హుస్నాబాద్ మండలంలోని ఆదర్శ గ్రామపంచాయతీగా వంగరామయపల్లెలను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకారం అందించాలని ఆమె గ్రామస్తులను కోరారు. అనంతరం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తిచేసి అధికారులకు సహకరించాలని ఆమె లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శారద, ఉపసర్పంచ్ దoడగుల రాజు, వార్డ్ మెంబర్లు బందెల శరత్ బాబు, వంగ యశోద, బోడ రమేష్,లావుడ్య రవీందర్ , లావుడియా రమ గ్రామస్తులు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.














