E-PAPER

నిద్రపోతున్న కాలుష్యాన్నియంత్రణ మండలి

Date : 06 March 2026, 4:10 pm Posted By : PRAJA GONTHUKA

నిద్రపోతున్న కాలుష్యాన్నియంత్రణ మండలి

నిద్రపోతున్న కాలుష్యాన్నియంత్రణ మండలి

ప్రజా గొంతుక న్యూస్, మార్చి 6 భద్రాద్రి కొత్తగూడెం:

సింగరేణి ప్రధాన కార్యాలయం సాక్షిగా పర్యావరణం ‘బూడిద’ అవుతోంది. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం సామాన్యుల ప్రాణాలకు ఉరితాడుగా మారుతోంది.

డంపింగ్ యార్డ్‌కు వెళ్లాల్సిన చెత్తను నిబంధనలకు విరుద్ధంగా సింగరేణి గృహ సముదాయాల ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో కుమ్మరిస్తున్నారు.

సాయంత్రం వేళ ఈ చెత్తకు నిప్పంటించడంతో ఆ ప్రాంతమంతా ‘గ్యాస్ ఛాంబర్’ను తలపిస్తోంది. కార్మికుల కుటుంబాలు ఊపిరాడక అల్లాడిపోతున్నాయి.

విజయవాడ-భద్రాచలం హైవేపై గోధుమవాగు వంతెన వద్ద దట్టమైన పొగ కమ్ముకోవడంతో వాహనదారులకు దారి కనిపించక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రాణవాయువు అందక ప్రయాణికులు విలవిలలాడుతున్నారు.

ప్రశ్నిస్తున్న ప్రజలు:

ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి నిద్రపోతోందా? లేక చూసీచూడనట్లు వ్యవహరిస్తోందా? అధికారుల కళ్లు తెరిపించేది ఎప్పుడు? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్