6 వ వార్డులో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమం......
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/షేక్ షాకీర్: హాలియా :మార్చి:06
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 6 వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన ప్రజా పాలన పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజా పాలన పట్టణ ప్రణాళిక ప్రోగ్రామ్ ను 6వ వార్డు కౌన్సిలర్ బొంగరాల యేసు రాజుమరియు వార్డు ఆఫీసర్ మహమ్మద్ మష్రత్,ఆర్ పి. కటికర్ల రమణ, మున్సిపల్ సిబ్బంది, వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రతిజ్ఞ చేసి పారిశుద్ధ పనులను చేపట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమం తేదీ 06-03-2026 నుండి 15-03-2026 వరకు కార్యక్రమాలు ఉంటాయని వార్డులోని పారిశుద్ధ్య పనులు అన్నిటిని పూర్తి చేస్తామని వార్డు ప్రజలందరూ భాగస్వామిలై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి వార్డును పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియపరచడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ గడ్డం జయమ్మ, గడ్డం రమణయ్య మద్దిమడుగు కిషోర్, గోపాల సూర్యచంద్ర, కొండేటి నరసింహ, పల్లేటి ఈదయ, కందుల చార్లెస్, గుంజే బాలరాజు, మద్దిమడుగు విజయ్, బొంగరాల యాకోబు, మారుపాక శాంతి కుమార్, గోపాల ప్రసాద్, గంజి కన్నమ్మ, కవిత,నవ్య, సుగుణమ్మ, నాగమణి,మరియు మహిళ సంఘం సభ్యులు. వార్డు ప్రజలు మహిళలు మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు పాల్గొనడం జరిగినది.












