రంజాన్ మాస ఉపవాస దీక్షలు ఫలించాలి
మాజీమంత్రి జి, జగదీశ్ రెడ్డి
ప్రజా గొంతుక న్యూస్,(మార్చి 05)సూర్యాపేట:రంజాన్ మాస ఉపవాస దీక్షలు ఫలించాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 48 వ వార్డులో బిఆర్ ఎస్ నాయకుడు షేక్ యాకుబ్ పాషా ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ముస్లిమ్ సోదరులకు ఇఫ్తార్ విందు వేడుకకు హాజరై, పలు కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసి మాట్లాడారు. ముస్లిం సోదరులందరిపై అల్లా దీవెనలు ఉండాలని
అన్ని మతాలకు సమ ప్రాధాన్యత కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ దే అని తెలిపారు.
ఆయా మతాల ప్రధాన పండుగలకు ప్రేమ విందుల ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఐక్యతతో అన్ని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నాం.
అదే స్ఫూర్తితో రంజాన్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
స్వయంగా పాషా ఇఫ్తార్ విందు తోఫా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు












