శ్రీ బగలాముఖి ఆలయానికి విచ్చేసిన మెదక్ జిల్లా అదనపు ఎస్పీ.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్, మార్చ్ 5:
మెదక్ జిల్లా.శివంపేట మండల కేంద్రంలోని శ్రీ భగలాముఖి శక్తిపీఠం అమ్మవారిని సాయంకాలం వేళ దర్శించుకుని ఆలయ పూజారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన గౌరవ మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్. ఆలయానికి విచ్చేసిన ఎస్పీ గారిని స్థానిక సర్పంచ్ రాజుపేట వెంకటేశ్వర్ శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజీపేట వెంకటేశ్వర్ , శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి , గ్రామశాఖ అధ్యక్షులు లక్ష్మీనర్సయ్య,వార్డు సభ్యులు శేరిపల్లి నరేష్, మాజీ వార్డు సభ్యులు కోవూరి వెంకటేష్, మరియు మినజీపేట కుమార్,రాజీపేట నర్సింలు తదితరులు పాల్గొన్నారు.












