విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి : మున్సిపాలిటీ చైర్మన్.
జోగులాంబ గద్వాల జిల్లా అల్లం పూర్ నియోజకవర్గం లోని
అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాలలో గురువారం ఎంఈఓ రాములు ఆధ్వర్యంలో హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ సురేష్ మరియు మోటివేషన్ స్పీకర్ శ్రీనివాసులు హాజరయ్యారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు భయంవీడి ఏకాగ్రతతో చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా చదవాలని,పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా పరీక్షలు రాయాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 100% ఉత్తీర్త సాధించాలన్నారు. నేను ఇదే స్కూల్లో సాధారణ విద్యార్థిగా చదివానని ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ప్రధమ పౌరుడిగా ఇదే స్కూల్ కి ముఖ్యఅతిథిగా రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థి గురువులను గౌరవించాలని వారి సూచనలు పాటించాలని అన్నారు. అనంతరం మోటివేషన్ స్పీకర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. విద్యార్థులు పరీక్షల్లో ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు గుర్తుకు తెచ్చుకొని ప్రశాంతంగా జవాబులు రాయాలన్నారు అప్పుడే మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ మరియు జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












