విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ......
ఎం పి పి ఎస్ నిడమనూరు పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం......
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:05
నేడు విద్యార్థులే అధికారులై,ఒక్క రోజు ఉపాధ్యాయులై నిడమనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పాలించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి హాజరైన నిడమనూరు సర్పంచ్ శ్రీమతి శేషరాజు సంధ్య కి సన్మానం చేయడం వారి చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేయడం జరిగింది.వారు పాఠశాల బాగోగులకు కచ్చితంగా సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
అలాగే జడ్పీహెచ్ఎస్ నిడమనూరు జిహెచ్ఎం & కాంప్లెక్స్ హెచ్ఎం డి గౌతమ్ సర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులుగా చెలామణి అయిన విద్యార్థులను ,వారి నిర్భయంగా సాగిన స్పీచ్లను పొగుడుతూ మున్ముందు కూడా ఇలాగే బాగా చదివి,ఎదిగి మా అంతటి వారయ్యి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదించడం జరిగింది.
అధికారులుగా ,విద్యాశాఖ మంత్రిగా యం డి ఆరిఫ, కలెక్టర్ గా వి.నిత్యశ్రీ, డి ఈ ఓగా ఏ యగ్నేష్, ఎం ఇ ఓ గా ఎన్ గౌతం, కాంప్లెక్స్ హెచ్ ఎం గా కే సాయి, హెచ్ ఎం గా ఆర్ స్వాతి మిగతా వారు టీచర్లుగా పాత్ర పోషించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ చంద్రకళ ,టీచర్లు కే శ్రీనుకుమార్, టి ఝాన్సీ,పి పూర్ణిమ, కే స్వాతి మరియు వాలంటీర్ ఏ స్వాతి , సి ఆర్ పి గంగరాజు పాల్గొనడం జరిగింది.












