E-PAPER

చిన్నారులలో చిరునవ్వు ఎంతో సంతోషం..

Date : 05 March 2026, 5:55 pm Posted By : PRAJA GONTHUKA

చిన్నారులలో చిరునవ్వు ఎంతో సంతోషం..

చిన్నారులలో చిరునవ్వు ఎంతో సంతోషం..

చిన్నారులకు అన్నప్రాసన చేసిన ఇజ్జగిరి రాములు

బలమైన పౌష్టికాహారం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

మండలంలోని బండనాగారం గ్రామంలొ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల కోసం అన్నప్రాసన కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మరియు మండల కాంగ్రెస్ సర్పంచ్ ఫోరంగ్రామ పెద్దలు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారుల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపింది అధ్యక్షుడు ఇజ్జగిరి రాములు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు మొదటి అన్నం తినిపించి ఆశీర్వదించారు. చిన్నారుల చిరునవ్వులతో అంగన్వాడీ కేంద్రం ఆనందోత్సాహాలతో కళకళలాడింది.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకరమైన పెరుగుదలకు సమయానికి పోషకాహారం చాలా ముఖ్యమని, బలమైన పౌష్టికాహారం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వారి కోసం ఎంతో కృషి చేస్తుందని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం, టీకాలు మరియు ఆరోగ్య సేవలను ప్రతి తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించారు. గ్రామంలోని ప్రతి తల్లి తన పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రానికి తీసుకురావాలని కోరారు.

అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల ఆరోగ్యం, పోషణ మరియు విద్యాభివృద్ధి కోసం చేస్తున్న సేవలను సర్పంచ్ అభినందించారు. చిన్నారుల భవిష్యత్తు బలంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచే సరైన పోషణ మరియు సంరక్షణ అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మానేపల్లి మల్లయ్య, యూపీఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ హేమరాణి, అంగన్వాడీ టీచర్లురజిత, గ్రామ మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్