పోలీసుల విధులకు ఆటంకం
వ్యక్తి అరెస్ట్.. రిమాండ్కు తరలింపు
ప్రజా గొంతుక న్యూస్ మార్చి 4 భద్రాద్రి కొత్తగూడెం
రామవరం ప్రశాంతినగర్ పంచాయతీ భూవివాదం కేసు విచారణకు వెళ్లిన పోలీస్ అధికారులపై తిరగబడి, వారి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘటన వివరాలు:
రామవరం సి.ఆర్.పి క్యాంప్ నివాసి పులిచర్ల ఆదిత్య (36), ప్రశాంతినగర్ భూవివాదానికి సంబంధించి విచారణకు వెళ్లిన పోలీస్ అధికారి మరియు సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, వారిని దూషిస్తూ విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సీఐ హెచ్చరిక:
ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ డి. ప్రతాప్ మాట్లాడుతూ.. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా నడుచుకోవాలని ఆయన సూచించారు.












