సిద్దిపేట ఆర్డీవోకి గ్రామ సర్పంచ్ ఏర్పుల వినతిపత్రం.
ప్రజా గొంతుక కొమురవెల్లి : మండలంలోని అయినా పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని తాళ్లకుంట చెరువు శికం మరియు ఆబాది భూమికి హద్దులు ఏర్పాటు చేసి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట ఆర్డీవో సదానందం గ్రామ సర్పంచ్ ఏర్పుల కళ్యాణి కృష్ణ వినతి పత్రం ఇచ్చారు.గ్రామంలోని ఆడపడుచులకు బతుకమ్మ ఆడుకోవడానికి స్థలం లేకుండా తాళ్లకుంట చెరువు శిఖం మరియు అబాది భూమి ఆక్రమించి అచ్చు కట్టి వ్యవసాయ నాటు వేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆక్రమించడమే కాకుండా గ్రామ తాళ్లకుంట చెరువు శిఖం భూమిని కాపాడాలని చూసిన గ్రామస్తుల 9మంది పై అక్రమంగా కోర్టులో కేసు వేసి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులు పద్ధతి ఇప్పటికైనా మార్చుకొని గ్రామకంఠం చెరువు శిఖం భూమిని ఇప్పటికైనా గ్రామానికి స్వచ్ఛందంగా అప్పగించాలని శిఖం భూమి ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గ్రామ సర్పంచ్ కళ్యాణి కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లం బాలయ్య,దేవరాయ ప్రభాకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు












