*కొమ్మాల జాతరకు కదిలిన కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లు.*
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్), 04 మార్చి 2026.
ప్రభ బండ్ల ముందు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి .
🔹 నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి , గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతరను పురస్కరించుకొని నర్సంపేట నియోజకవర్గం నుండి వందలాదిగా కదిలిన కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ,
పూర్వం నుండి హోళీ పర్వదినం నుండి ప్రారంభమయ్యే కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతరకు నర్సంపేట నియోజకవర్గంతో పాటు వరంగల్ జిల్లాలో ప్రభ బంన్లను కట్టే ఆనవాయితీ కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సంపేట నియోజకవర్గంలోని వందలాది గ్రామాల నుంచి ప్రభలు కట్టి లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో ఉత్సాహంతో మెల తిరిగి లక్ష్మీ నరసింహ స్వామి కరుణాకటాక్షాలకు పాత్రులై ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి ఎంతో మహిమ గల దైవమని , లక్ష్మీనరసింహస్వామి దీవెనలతో నర్సంపేట నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని , కాంగ్రెస్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అని అన్నారు.
పెద్ద ఎత్తున ప్రబల వెంట గ్రామాలలోని ప్రజలు,మహిళలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు భాజా భజంత్రీలతో కాంగ్రెస్ పాటలతో నాట్యాలాడుతూ పాల్గొన్నారు.












