12వ వార్డు అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన కౌన్సిలర్.
ప్రజా గొంతుక చేర్యాల : పట్టణంలోని 12వ వార్డు అంగన్వాడి సెంటర్ ను సందర్శించి చిన్నపిల్లల ఆరోగ్య స్థితిగతులను తెలుసు కున్నారు. ఈ సందర్భంగా షరేపా బేగం ఖాజా మాట్లాడుతూ పిల్లలకు అందవలసిన పౌష్టికా ఆహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని పిల్లల ఎదుగుదలలో అంగన్వాడి సెంటర్లు ఎంత దోహదపడుతాయని పిల్లల స్థితిగతులను అవగాహన చేసుకోవడంలో నైపుణ్యం కలుగుతుందని అన్నారు. మౌలిక వసతులను పరిశీలించిన అనంతరం ఇంకేమైనా అవసరాలు ఉంటే తమ దృష్టికి తేవాలని షరీఫా బేగం కాజా అన్నారు. అంగన్వాడి సెంటర్లకు శాశ్వత భవనాల కోసం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సహకారంతో,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో నూతన బిల్డింగుల ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ బాలమణి ఆయమ్మ తదితరులు పాల్గొన్నారు.












