మృతుని కుటుంబానికి సర్పంచ్ సహాయం...
ఆపదలో అండగా నిలిచిన సర్పంచ్...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
నక్క వాని గూడెం గ్రామంలో గోదాల అంజయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులను సర్పంచ్ పోతుల వెంకటేష్ యాదవ్ ఉప సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్లతో కలిసి పరామర్శించి, నేనున్నానని మనోధైర్యాన్ని ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఆపద సమయంలో ఆదుకుంటామని , గోదాల అంజయ్య మంచి వ్యక్తిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కట్టెల స్వామి, ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ మాధవి భాస్కర్ రెడ్డి, బొమ్మిడి దయాకర్ రెడ్డి, గోదాల యాదగిరి, కృష్ణ , స్వామి, జక్కుల విజయ్, గోదాల కృష్ణ, క్రాంతి ,సిద్ధులు ,పోతుల రవి, తదితరులు, పాల్గొన్నారు.












