ప్రజా గొంతుక దినపత్రికకు స్పందన
*గ్రామంలో త్రాగునీటి సమస్యను తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకొని బోరు పంపు అమర్చిన గ్రామ సర్పంచి అంజిలయ్య.*
కుల్కచర్ల,ప్రజా గొంతుక న్యూస్: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని అంగడి బజార్ కిందికేరిలో నిరుపయోగంగా ఉన్న బోరు పంపుకు మోటార్ అమర్చి గ్రామ ప్రజలకు నీటి సమస్య లేకుండా చేసిన గ్రామ సర్పంచి వార్వల అంజలయ్య,పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్, ఉపసర్పంచి విజయ్ కుమార్. త్రాగునీటి సమస్యపై ప్రత్యేకంగా చొరవ తీసుకొని బోరు పంపు అమర్చి నీటి సమస్యను తీర్చారు.వార్డు మెంబర్ మోత్కూర్ వెంకటేష్ తెలిపిన నీటి సమస్యఫై ఆదివారము ప్రజా గొంతుక దినపత్రిక కథనానికి గ్రామపంచాయతీ ప్రత్యేకంగా స్పందించి నీటి సౌకర్యం కల్పించారు.గ్రామ సమస్యల పట్ల ప్రత్యేకంగా కృషి చేస్తున్న సర్పంచి అంజిలయ్య,ఉపసర్పంచి విజయ్ కుమార్,పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్ లకు గ్రామ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబెర్స్, పంచాయతీ సిబ్బంది,తదితరులు ఉన్నారు.












