నల్గొండలోప్రైవేట్ స్కూల్ బస్సు నిర్లక్ష్యానికి ఇద్దరు యువ విద్యార్థులు బలి.....
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:02
నల్గొండ మండలం చందనపల్లి గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది
ఇంటర్ పరీక్ష రాయాలనే ఆశతో బయలుదేరిన ఇద్దరు యువకులు మార్గమధ్యంలోనే మృతిచెందడం హృదయ విదారకం
శాలిగౌరారం మండలం బండమీది గూడెం గ్రామానికి చెందిన గైగుల్ల వంశీ (20), ఉట్కూర్ గ్రామానికి చెందిన గుడిసె రవి (20) స్ప్లెండర్ ప్లస్ బైక్ పై నల్గొండకు వస్తుండగా, చందనపల్లి వద్ద ఎదురుగా వచ్చిన ఎస్ పి ఆర్ స్కూల్ కు చెందిన బస్సు అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకోవడంతో ఘోర ప్రమాదం జరిగిందిబైక్ను ఢీకొట్టిన బస్సు కారణంగా ఇద్దరు యువకులు తీవ్ర రక్తగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు
ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ఇలా మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచి వేసిందని
తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఎదగాలని కలలు కన్న కుటుంబాలకు ఈ ఘటన పెద్ద దెబ్బగా మారింది
ప్రైవేట్ స్కూల్ బస్సులు రోడ్లపై అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయనే విమర్శలు మళ్లీ వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థుల భద్రతను బోధించే సంస్థలే రోడ్డు భద్రతలో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే సమాజం ఎవరిని ఆశ్రయించాలి.?
వంశీ తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నల్గొండ రూరల్ ఎస్ఐ సైదా బాబు తెలిపారు...
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు...
ఈ విషాద ఘటన మరోసారి ప్రైవేట్ విద్యాసంస్థల రవాణా విధానాలపై ప్రశ్నార్థక చిహ్నం మిగిల్చింది
నిర్లక్ష్యానికి మూల్యం అమాయకుల ప్రాణాలేనా అనే ప్రశ్నకు సమాధానం కార్పొరేట్ పాఠశాలలు పెట్టి తీరాల్సిందే!












