E-PAPER

నల్గొండ జంతుశాస్త్ర విభాగంలో ఒప్పంద అధ్యాపకురాలికి డాక్టరేట్ పట్టా……

Date : 02 March 2026, 6:51 pm Posted By : PRAJA GONTHUKA

నల్గొండ జంతుశాస్త్ర విభాగంలో ఒప్పంద అధ్యాపకురాలికి డాక్టరేట్ పట్టా……

నల్గొండ జంతుశాస్త్ర విభాగంలో ఒప్పంద అధ్యాపకురాలికి డాక్టరేట్ పట్టా......

మిస్కిన్ తరన్నంకు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జగదీష్‌ప్రసాద్ ఝబర్మల్ తిబ్రేవాలా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:02

నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నల్గొండ జంతుశాస్త్ర విభాగంలో ఒప్పంద అధ్యాపకురాలిగా పనిచేస్తున్న మిస్కిన్ తరన్నంకు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జగదీష్‌ప్రసాద్ ఝబర్మల్ తిబ్రేవాలా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది.

ఆమె ప్రొఫెసర్ . డాక్టర్ ఇమ్రాన్ ఖాన్ పర్యవేక్షణలో జెనెటిక్ రిసోర్సెస్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మేజర్ కార్ప్స్ ఇన్ సౌత్ ఇండియన్ రీజియన్ అండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్” అనే ప్రాముఖ్యమైన అంశంపై విస్తృత పరిశోధన నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని ప్రధాన కార్ప్ చేపల జన్యు వనరులు, వాటి వైవిధ్యం, భౌగోళిక విస్తరణ, సంరక్షణ అవసరాలు వంటి అంశాలను లోతుగా అధ్యయనం చేసి, శాస్త్రీయ ఆధారాలతో కూడిన విశ్లేషణను సమర్పించారు.

ఈ పరిశోధన ద్వారా చేపల జన్యు సంపద పరిరక్షణ, ఆక్వాకల్చర్ అభివృద్ధి, జీవ వైవిధ్య సంరక్షణకు దోహదపడే విలువైన సూచనలు అందించారని విశ్వవిద్యాలయ వర్గాలు ప్రశంసించాయి. పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో చేపల ఉత్పత్తి పెంపు, స్థానిక జాతుల పరిరక్షణ, మరియు పర్యావరణ సమతుల్యత కాపాడడంలో కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు.

డాక్టరేట్ సాధించిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ కె. శ్రీనివాసరాజు, గ్రంథాలయాధిపతి డాక్టర్ సుంకరి రాజారాం, జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ చి. సమత, డాక్టర్ కె. వనజ, డాక్టర్ మల్లేష్, వైష్ణవి, సంతోష్ కుమార్ తదితర అధ్యాపకులు ఆమెను అభినందించారు.

ఈ సందర్భంగా అధ్యాపక వర్గం మాట్లాడుతూ, మిస్కిన్ తరన్నం సాధించిన ఈ విజయంతో కళాశాలకే గౌరవం పెరిగిందని, విద్యార్థులకు ఇది ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేసి జంతుశాస్త్ర రంగానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్