హాలియా మున్సిపాలిటీలో దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి వేడుకలు....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:02
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి సందర్భంగా ఈరోజు (02.03.2026) ఉదయం 11:30 గంటలకు హాలియా పురపాలక కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ సమాజ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ ,11 వ వార్డు కౌన్సిలర్
డి ప్రసాద్ బాబు ,2వ వార్డు కౌన్సిలర్ సలహాదారులు నకిరెకంటి సైదులు, 5వ వార్డు కౌన్సిలర్ సలహాదారులు కరుణాసాగర్ ,12వ వార్డు కౌన్సిలర్ సలహాదారులు ఎడవెల్లి రంజిత్ , పుర ప్రముఖులు గడ్డం రమణయ్య , అలాగే మున్సిపల్ కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాద రావు ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.












