జూరాలడ్యాంచేపలఅడ్డా,అగ్గిపుట్టించేఅసలైన గద్వాల ఘాటు కథ.
డ్యాంసందర్శకులఅభిప్రాయ సేకరణ.
ప్రజా గొంతుక ప్రతినిధి దేవేందరరెడ్డిజోగులాంబ గద్వాల జిల్లా.
జోగులాంబగద్వాలజిల్లాజూరాలడ్యామ్,గేట్లు ఎత్తితే కృష్ణమ్మ ఎలా ఉరకలేస్తుందో ఇక్కడ చేపల మార్కెట్ కూడా అంతే రఫ్ అండ్ టఫ్ గాఉరకలువేస్తుంది.ఇక్కడ వ్యాపారం అంటే ఏసీరూముల్లోజరిగేబేరం కాదు నెత్తిన ఎండ, ముక్కుకుతగిలేపచ్చిచేపలవాసన,చెవుల్లోమత్స్యకారులగంభీరమైన అరుపుల మధ్య జరిగే ఒకఆనందకరమైనయుద్ధవాతావరణంవిషయాలుతెల్లవారుజామున బేరంగర్జన,పొద్దున్నే4.00గంటలకేజూరాలబ్యాక్ వాటర్ గట్టు మీదసీన్ మొదలవుతుంది.చీకట్లోటార్చ్,లైట్లువెలుగుతుంటే,నీళ్లలో నుంచి బుట్టలకొద్దీచేపలుఒడ్డుకుచేరుతాయి.ఆశబ్దంఏయ్ఈకొర్రమీనులాట్ నాది,వందతక్కువైతే అస్సలుఇయ్యనుఅంటూ సాగే బేరసారాల ఘాటు మామూలుగా ఉండదు. గద్వాలయాసభాషలో వాళ్లు తిడుతున్నారో, ప్రేమిస్తున్నారోఅర్థంకాదుకానీఆమాటలుతుపాకీగుళ్లలాపేలుతుంటాయి.
మాయాజాలం: అక్కడ ఒక్క నిమిషం ఆలస్యం చేసినా,మంచి చేప వేరే వాడిబుట్టలోకివెళ్ళిపోతుంది.అది ఒకఅడవి.. అక్కడ తెలివైనవాడిదే చేప.
కట్టెల పొయ్యి మీదఅగ్గి రాజేసేపులుసు,జూరాలగట్టునఉన్నరేకులషెడ్ల హోటళ్ల దగ్గరికి వెళ్తే అసలైనఆటమొదలవుతుంది.అక్కడవంటమనుషులు చేసే మ్యాజిక్ మామూలుగాఉండదు.
మసాలాదెబ్బరోట్లోదంచిన పచ్చిఅల్లం,వెల్లుల్లి పేస్ట్,ఎర్రగామండుతున్నఎండుమిర్చికారందోరగావేయించినధనియాల పొడి ఈమూడింటినీ నూనెలోవేయగానే,వచ్చే ఆ ఘాటుకు మైలు దూరంలో ఉన్నవాడికి కూడాతుమ్ములురావాల్సిందేఆ ఉడుకు మట్టి కుండలో చింతపండు పులుసుపోసి,అందులో జూరాల నీళ్లలో పెరిగిన తాజాచేపముక్కలువేసికట్టెలపొయ్యిమీదఉడికిస్తుంటేఆవిర్లుకమ్ముకుంటాయి. ఆపులుసు తింటే నోరు మండాలి, చెవుల్లో నుంచి పొగలు రావాలి.అప్పుడే అది జూరాలడ్యాంసందర్శన స్పెషల్.
కొర్రమీను - గద్వాలగడ్డ మీద మొనగాడుఇక్కడ కొర్రమీనుఅంటేఅదికేవలంచేపకాదు,ఒకబ్రాండ్ జూరాలరాళ్లమధ్య,కృష్ణమ్మ సుడిగుండాల్లో ఈదుతూ పెరిగే ఈ చేప మాంసంరబ్బరులాసాగదు.గట్టిగా,రుచిగాఉంటుంది.
జూరాలకొర్రమీనుముక్క తింటే బతికున్నంత కాలం ఆ రుచి నాలుక మీదనాట్యంచేయాల్సిందే.దానిని నూనెలోదేవి, పైన గద్వాల కారం చల్లి ఇస్తుంటే ఆ క్రిస్పీనెస్ కి ఎవరైనాఫిదా,అవ్వాల్సిందే నని యాత్రికుల వారిఅభిప్రాయంవెలిబుచ్చారు.
గట్టుమీదమాస్,వాతావరణంమార్కెట్లోమనుషులు ఎంత కరుకుగా ఉంటారో,మనసుఅంత పారదర్శకంగాఉంటుంది.మహిళల పట్టుదల చేపల పొలుసులు తీసే అక్కల చేతుల్లో ఉండే వేగంచూస్తేఆశ్చర్యంవేస్తుంది.వాళ్లకత్తులవేగానికి నిమిషాల్లో కిలోల కొద్దీచేపలుక్లీన్అయిపోతాయి.రఫ్ అండ్ టఫ్ అక్కడ "సార్, ప్లీజ్"అనే మాటలుఉండవు.అంతా "ఏంభాయ్..ఇస్తావా ఇయ్యవా?"అనేలెవల్లోనే ఉంటుంది. ఆలోకల్ మాస్ పవర్ ఆమార్కెట్ కిఒకప్రత్యేకగుర్తింపునిస్తుంది.
సాయంత్రంవేళఒకజాతరఆదివారంవచ్చిందంటే చాలు గద్వాల నుండే కాదు, కర్నూలు, రాయచూరునుంచికూడాజనంవస్తారు.డ్యామ్ వ్యూచూస్తూ,చేపలపులుసుతోవేడివేడిఅన్నం కలుపుకునితింటుంటే ఆ కిక్కే వేరు. గాలిలో చేపల వేపుడు వాసన చుట్టూ జనం రద్దీఅదొక పక్కా లోకల్ జాతర.
జూరాల చేపలమార్కెట్ అంటే కేవలం కొనడం, అమ్మడంకాదు.అదిఒక ఎమోషన్ ఆ ఘాటు,ఆ కారం,ఆకరుకుదనం.ఇవే గద్వాలమట్టిలోఉన్న అసలైన బలం.













