గొరిల్లా వేషధారణతో కోతులలో తరిమికోట్టేందుకు సర్పంచ్ తుల విన్నుత్న ఆలోచన..
ప్రజా గొంతుక (మార్చి 01)కాల్వ శ్రీరాంపూర్ : గ్రామాలలో రోజురోజుకు కోతుల బెడద ఎక్కువ అవుతుండడంతో వాటిని తరిమికొట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు గ్రామస్తులు. ఈ క్రమంలో పెద్దపెల్లి జిల్లాకాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మోట్లపల్లి గ్రామ సర్పంచ్ తుల మనోహర్ రావు కోతుల బెడదను అరికట్టడానికి ప్రయత్నం చేశారు దాంతో, గ్రామ యువకులు సహకరించారు. ఊరి గ్రామస్థులంతా అభినందించారు. ఎలక్షన్ లో గెలిచిన అనంతరం ప్రమాణ స్వీకారం రోజు, గ్రామస్తులు కోతుల బెడద తో పంట పొలాల,ఇంటి వస్తువుల చిందర వందర చేస్తున్న సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు ఆదివారం రోజున ఎలుగుబంటి, గొరిల్లా,మాస్కులు కొనుగోలు చేసి, ఆ మాస్కులను వార్డు సభ్యులు,గ్రామ ప్రజలు ఎలుగుబంటి వేషధారణ ధరించి, కోతులను తరిమికొట్టేందుకు పనిని మొదలుపెట్టారు. ఆ గొరిల్లా బట్టలు ధరించిన వ్యక్తులు అచ్చం గొరిల్లాల అరెస్టు, చేతులు తిప్పుతూ గ్రామంలో అన్ని వీధిలో తిరగడం మొదలుపెట్టారు. అవి వారిని చూసి భయపడి పారిపోతున్నాయి. ఈ విధంగా గ్రామంలో కోతులు పెడితే తగ్గుముఖం పట్టుతుందని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు గాజుల రాజకుమార్, గాదర్ల తిరుపతి, ఎండి షరీఫ్, నవీన్,అనుముల కుమార్, శ్రీపతి వినయ్, వంశీ, విష్ణు,, అనుముల రాంప్రసాద్, రాజేందర్, పీకరాజయ్య, అనుముల రాజయ్య, బెజ్జాల శంకర్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












