E-PAPER

విద్యానగర్ వసుధ టవర్స్ అపార్ట్మెంట్ వాసుల అభినందనలు

Date : 01 March 2026, 5:45 pm Posted By : PRAJA GONTHUKA

విద్యానగర్ వసుధ టవర్స్ అపార్ట్మెంట్ వాసుల అభినందనలు

నల్లగొండ కార్పొరేషన్ 41వ డివిజన్ కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డికి..... విద్యానగర్ వసుధ టవర్స్ అపార్ట్మెంట్ వాసుల అభినందనలు

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:01

నల్లగొండ కార్పొరేషన్ 41వ డివిజన్ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన కేసాని వేణుగోపాల్ రెడ్డి కి విద్యానగర్ వసుధ టవర్స్ అపార్ట్మెంట్ వాసులు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించి పూల బొకే అందజేశారు. గతం లో మున్సిపల్ కౌన్సిలర్ గా వేణుగోపాల్ రెడ్డి పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడం తో పాటు, నిత్యం ప్రజల మధ్య అందుబాటులో ఉంటారని అపార్ట్మెంట్ వాసులు కొనియాడారు. ఎవరికి ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందించేతత్వం వేణుగోపాల్ రెడ్డి సొంతం అని.. అందుకే నూతనంగా ఏర్పడిన నల్లగొండ కార్పొరేషన్ లోనూ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించారని గుర్తు చేశారు. అందరికీ ఆత్మీయుడుగా గుర్తింపు పొందిన వేణుగోపాల్ రెడ్డి భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని పదవులు అధిష్టించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో వసుధ టవర్స్ అపార్ట్మెంట్ వాసులు మేరెడ్డి జనార్దన్ రెడ్డి, తుమ్మల లింగస్వామి, యరెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, లోట్లపల్లి కోటయ్య, దాయం భూపాల్ రెడ్డి, సత్తిరెడ్డి, వాసుదేవుల ప్రఖ్యాత్, రమేష్, చంద్రశేఖర్ రావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

నల్లగొండ కార్పొరేషన్ 41వ డివిజన్ కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డికి….. విద్యానగర్ వసుధ టవర్స్ అపార్ట్మెంట్ వాసుల అభినందనలు

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:01

నల్లగొండ కార్పొరేషన్ 41వ డివిజన్ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన కేసాని వేణుగోపాల్ రెడ్డి కి విద్యానగర్ వసుధ టవర్స్ అపార్ట్మెంట్ వాసులు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించి పూల బొకే అందజేశారు. గతం లో మున్సిపల్ కౌన్సిలర్ గా వేణుగోపాల్ రెడ్డి పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడం తో పాటు, నిత్యం ప్రజల మధ్య అందుబాటులో ఉంటారని అపార్ట్మెంట్ వాసులు కొనియాడారు. ఎవరికి ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందించేతత్వం వేణుగోపాల్ రెడ్డి సొంతం అని.. అందుకే నూతనంగా ఏర్పడిన నల్లగొండ కార్పొరేషన్ లోనూ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించారని గుర్తు చేశారు. అందరికీ ఆత్మీయుడుగా గుర్తింపు పొందిన వేణుగోపాల్ రెడ్డి భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని పదవులు అధిష్టించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో వసుధ టవర్స్ అపార్ట్మెంట్ వాసులు మేరెడ్డి జనార్దన్ రెడ్డి, తుమ్మల లింగస్వామి, యరెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, లోట్లపల్లి కోటయ్య, దాయం భూపాల్ రెడ్డి, సత్తిరెడ్డి, వాసుదేవుల ప్రఖ్యాత్, రమేష్, చంద్రశేఖర్ రావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్