అప్పు తెచ్చి ట్రాక్టర్ కొనుగోలు చేయవద్దని తండ్రి కొడుకును మందలించినందుకు కొడుకు పురుగుమందు తాగి మృతి.
ప్రజా గొంతుక( మార్చి01) కాల్వ శ్రీరాంపూర్ : పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన జగ్గయ్యపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మల్యాల గ్రామపంచాయతీ పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన రెడ్డి మధుసూదన్ రెడ్డి అను వ్యక్తి,గత కొద్ది రోజుల క్రితం అప్పు చేసి నూతన ఇల్లు నిర్మించుకొనగా, మళ్లీ అప్పు తెచ్చి నూతన ట్రాక్టర్ కొనుగోలు చేస్తానని కుటుంబ సభ్యులకు తెలుపగా, మృతుని తండ్రి అయిన రాంరెడ్డి కొడుకు మధుసూదన్ రెడ్డిని, ఇంటి అప్పు ఇంకా బకాయి ఉండగా, మళ్లీ అప్పు చేసి ట్రాక్టర్ కొనుగోలు చేయడం ఎందుకని మందలించడంతో, ఇరువురి మధ్యల వాదోపవాదనాలు జరిగాయని, నూతన ట్రాక్టర్ కొనుగోలు చేయనీయడం లేదు అని,కొడుకు మనస్థాపం తో గత నెల 25వ తేదీన, పురుగుల మందు తాగగా, చుట్టుపక్కల వారు గమనించి మండల కేంద్రంలోని ప్రభుత్వ హస్పటల్ తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించి, చికిత్స కొనసాగిస్తుండగా, ఆదివారం రోజు మరణించినట్లు మృతుని భార్య పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూన్నట్టు ఎస్సై సులువా వెంకటేష్ తెలిపారు.












