పక్షవాత బాధితురాలికి తోటి వికలాంగుడు వాకర్ స్టాండ్ ఆర్థిక సహాయం.
ప్రజా గొంతుక చేర్యాల : పట్టణ కేంద్రంలోని మొండిచింత కాలనీకి చెందిన నిమ్మ లచ్చవ్వ ఇటీవలే మెదడులో రక్తం గడ్డ కట్టి పక్షవాత బారినబడి ఎడమ చేయి ఎడమ కాలు పడిపోయి ఇంటి వద్ద ఫిజియోథెరపీ చికిత్స తీసుకుంటూ ఈ వృద్ధురాలకి లచ్చవ్వకు కొడుకులు లేక ఇద్దరు కూతుర్ల మీదనే ఆధారపడి జీవనాధారం పొందగా లచ్చవ్వకు వాకర్ స్టాండ్ తో నడిపించాలని వైద్యులు కోరగా ఈ విషయాన్ని గమనించిన తుమ్మలపల్లి అనిల్ తన వంతు సాయకంగా ఆదివారం రోజున వెంటనే అతను తన వద్దనున్న ఒక వాకర్ స్టాండ్ ను వృద్ధురాలు ఇంటికి వెళ్లి ఆమెకు ఇచ్చి తగు జాగ్రత్తలు తెలిపి తనకు తోచిన సహాయాన్ని అందించాడు.అనంతరం కుటుంబ సభ్యులు వికలాంగుడికి ధన్యవాదములు తెలిపారు.












