రోడ్డు ప్రమాదాల నివారణపై సారధి కళా ప్రదర్శన.
సర్పంచ్ పచ్చిమడ్ల అనూష స్వామి గౌడ్ పిలుపు.
ప్రజా గొంతుక కొమురవెల్లి : మండలంలోని రసూలాబాద్ గ్రామంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి బీజ్జురి రవికుమార్ తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో సాంస్కృతిక సారధి కళాబృందం సైబర్ నేరాలపై రోడ్డు భద్రత నియమాలపై గంజాయి నియంత్రణ పై కళాకారులు ఆట పాటల ద్వారా ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్రామ సర్పంచ్ పచ్చిమడ్ల అనూష స్వామి గౌడ్ హాజరై మాట్లాడుతూ సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని యువత సోషల్ మీడియా పట్ల అప్రమత్తం ఉండాలని ఆన్ లైన్ గేమ్ లు బెట్టింగ్ లకు అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని చెడు అలవాట్లకు కుటుంబాలను రోడ్డున పడవేయవద్దని కోరారు
చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకుని ఎన్నో జీవితాలు ఆగమవుతున్నాయని మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని మద్యం సేవించి వాహనం నడపరాదని ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలని సూచించారు.యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని,శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే పోలీస్ టోల్ ప్రీ నెంబర్ 100 కు ఫోన్ చేయాలని తల్లిదండ్రులు వారి పిల్లలకు బాధ్యత నేర్పించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఎర్రోళ్ల సుదర్శన్, మాజీ సర్పంచ్ స్వామి గౌడ్, వార్డు మెంబర్స్, బహుదూర్ రాధిక కిరణ్ మరియు అబ్దుల్లా నర్సయ్య శ్రీనివాస్ ఎల్లయ్య తెలంగాణ సాంస్కృతిక సారధి టీం లీడర్,పిల్లిట్ల శ్యామ్ సుందర్,సారధి కవి గాయకులు పిన్నింటి రత్నం,సనువాల కనకయ్య,గెంటె హరిప్రసాద్,పన్నీరు శ్రీనివాస్,పిన్నింటి ప్రకాష్,ఎల్ల సిద్దులు,తండ బిక్షపతి, రాచపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు.












