మార్చ్ 2న జరిగే బీసీ మహాధర్నా ను జయప్రదం చేయాలి
ప్రజా గొంతుక న్యూస్,(ఫిబ్రవరి 28)సూర్యాపేట:మార్చి రెండో తేదీన హైదరాబాదులో జరిగే బిసి మహాధర్నాను విజయవంతం చేయాలని బిసి ఇంటలెక్చువల్ ఫోరం నల్గొండ జిల్లా ఇంచార్జ్ డేగల జనార్ధన్ విజ్ఞప్తి చేశారు. సూర్యాపేటలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పార్టీలు మాటలు మాత్రమే మాట్లాడుతున్నాయని వారి అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన బడ్జెట్ను ఇవ్వాలని అందుకోసం బీసీ సబ్ ప్లాన్ అమలు పరచాలని డిమాండ్ బీసీలను నిందించే సందర్భంలో వారిని చట్టబద్ధంగా కాపాడేందుకు బీసీ అట్రాసిటీస్ చట్టం రాబోయే శాసనసభ సమావేశాల్లో రూపొందించాలని రెండు డిమాండ్లతో పాటుగా అనేక ఇతర అంశాలను చర్చించేందుకు బడుగు బలహీన వర్గాల ఐక్యత ను మరింత పెంపొందించేందుకు పోరాట రూపాలు దోహదం చేస్తాయని అన్నారు. మార్చి 2న హైదరాబాదులో జరిగే మహాధర్నాకు విస్తృతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. బీసీల ఐక్యత వల్ల ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించామని రాజ్యాధికారమే పరమావధిగా తమ కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్పి రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి వట్టే జానయ్య యాదవ్, జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య కార్యదర్శి మీర్ అక్బర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్ యాదవ్, పెన్ పహాడ్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య యాదవ్, ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షులు బొల్లె సైదులు, చాంద్ పాషా,యెగ్గడి మురళి, వట్టే లింగరాజు, తదితరులు పాల్గొన్నారు












