పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామసభ.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్, ఫిబ్రవరి 28 :
మెదక్ జిల్లా.శివంపేట మండలం,చెన్నాపూర్ గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి,ఆర్ఐ నిరంజన్,విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అనగా కులమాతాలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ సన్నిత సంబంధాలు కలిగి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో చెన్నాపూర్ సర్పంచ్ ఆకుల కొమురయ్య, ఉప సర్పంచ్ గుమ్మల శ్రీలత శ్రీనివాస్, గ్రామపంచాయతీ సెక్రటరీ శోభారాణి, గ్రామపంచాయతీ పాలక మండలి సభ్యులు,మాజీ సర్పంచి బొల్లా భారతి బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,గ్రామస్తులు, పాల్గొనడం జరిగింది.












