E-PAPER

నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుదాం….. స్మార్ట్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పిలుపు….

Date : 28 February 2026, 8:56 pm Posted By : PRAJA GONTHUKA

నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుదాం….. స్మార్ట్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పిలుపు….

నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుదాం..... స్మార్ట్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పిలుపు....

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:28

 

స్మార్ట్ మేయర్ – స్మార్ట్ సిటీ లక్ష్యంతో నల్లగొండలో అభివృద్ధి పథం వేగవంతం.

నల్లగొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు...

శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో జరిగిన తొలి కార్పొరేషన్ సమావేశంలో ఆమె స్పష్టం చేశారు...

నగర అభివృద్ధిలో పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్లు, డ్రైనేజ్ వంటి ప్రాథమిక సమస్యలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు...

వచ్చే ఏడాది నాటికి 24 గంటల కృష్ణా జలాలు అందించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు...

వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా ఐదు సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామని, ఒకటి ఇప్పటికే పూర్తయిందని చెప్పారు....

మిగతా పనులు త్వరలో పూర్తి చేసి ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పిస్తామని హామీ ఇచ్చారు...

ప్రకాశం బజార్ ప్రాంతంలో సమస్యలు దృష్టిలో ఉంచుకుని వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ దుకాణాల ఏర్పాటు చేశామని, అక్కడ కనీస సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు...

కార్పొరేటర్లు ప్రస్తావించిన పారిశుధ్య లోపాలు, దోమల ఉధృతి, వీధిలైట్ల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటామని మేయర్ తెలిపారు...

పదో డివిజన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు...

⬇ DOWNLOAD
×

నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుదాం….. స్మార్ట్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పిలుపు….

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:28

 

స్మార్ట్ మేయర్ – స్మార్ట్ సిటీ లక్ష్యంతో నల్లగొండలో అభివృద్ధి పథం వేగవంతం.

నల్లగొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు…

శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో జరిగిన తొలి కార్పొరేషన్ సమావేశంలో ఆమె స్పష్టం చేశారు…

నగర అభివృద్ధిలో పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్లు, డ్రైనేజ్ వంటి ప్రాథమిక సమస్యలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు…

వచ్చే ఏడాది నాటికి 24 గంటల కృష్ణా జలాలు అందించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు…

వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా ఐదు సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామని, ఒకటి ఇప్పటికే పూర్తయిందని చెప్పారు….

మిగతా పనులు త్వరలో పూర్తి చేసి ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పిస్తామని హామీ ఇచ్చారు…

ప్రకాశం బజార్ ప్రాంతంలో సమస్యలు దృష్టిలో ఉంచుకుని వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ దుకాణాల ఏర్పాటు చేశామని, అక్కడ కనీస సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు…

కార్పొరేటర్లు ప్రస్తావించిన పారిశుధ్య లోపాలు, దోమల ఉధృతి, వీధిలైట్ల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటామని మేయర్ తెలిపారు…

పదో డివిజన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :